జనగామ, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : ప్ర ధానమంత్రి నరేంద్రమోదీ తన స్థాయి.. హోదాను మరిచి రాజకీయాల కోసం నిజామాబాద్ సభలో ఒక బఫూన్.. జోకర్‌గా మాట్లాడటం సిగ్గు చేటని ఎమ్మెల్సీ, స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీచైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పా గాల సంపత్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లుగా ప్రధానిగా తెలంగాణలోనీ భాగస్వామ్యం చూపించు.. అడుగడుగునా రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేస్తున్నావ్..ప్రజలను కించపరుస్తున్నావ్..ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానించేలా మాట్లాడుతున్నావని మండిపడ్డా రు.
ప్రధాని హోదాలో తెలంగాణకు పెండింగ్ ప్రా జెక్టులు ప్రకటిస్తారని.. నిధులు మంజూరు చేస్తారని ఆశపడితే దానికి భిన్నంగా తెలంగాణ సమా జాన్ని అగౌరపరిచేలా.. కేసీఆర్‌ను అవమాన పరి చేలా మాట్లాడడం జుగుప్సాకరం.. ప్రజాస్వామ్యవాదులు తీవ్రం గా ఖండించాలని కడియం పిలుపునిచ్చారు. ప్రధాని, సీఎం ముఖాముఖీ మాట్లాడుకునే సందర్భంలో చాలా చర్చకు వస్తా య్.. వాటిని రాజకీయానికి ఉపయోగించుకో వడం నీచమని అన్నా రు.
కేటీఆర్‌ను సీఎం చేయాలని ప్రజలు అనుకుంటే అడ్డుకోవడం నీ అయ్య నుంచి కూడా కాదు మోదీ అని కడియం ఘాటుగా స్పందించారు. మోదీకి సిగ్గుంటే..మనిషి వైతే విభజన హామీలను తొకిపట్టి.. ఎందుకు వాటిని తొమ్మిదేళ్లుగా ఎందుకు నెరవేర్చలేదు..? ఈ పదేళ్ల ప్రధానిగా నువ్వు తెలంగాణకు ఒరగబెట్టింది ఏంటి? కొత్త రాష్ట్రం అభివృద్ధిలో నీ భాగ స్వా మ్యం ఏది? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కనీసం సర్వే అయినా చేయించావా? బ య్యారం స్టీల్ ప్రయ త్నం జరిగిందా? కనీసం దానిపై అధ్యయనం చేశారా? ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు వద్ద గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటును పెండింగ్‌లో పెట్టి..ఆంధ్రాలో ముందే ఇచ్చావ్ కదా? అన్నారు. జాకారం వద్ద ట్రైబల్ యూనివర్సిటీకి సరిపడా భూములు అప్పగించి నా పదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో పెట్టావ్.. ? పోలవరా నికి ఇచ్చి కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు అని కడియం ప్రశ్నించారు.
ఓట్లు అడగడానికి బీజేపీకి సిగ్గుండాలి..
బీజేపీ వాళ్లకు ఓట్లు అడగానికి సిగ్గు ఉందా? నైతికత ఉందా.. అడుగడుగునా తెలంగాణను అవమానిస్తున్న ఇలాంటి పార్టీ మనకు అవసర మా? అని కడియం ధ్వజమెత్తారు. బీజేపీ నేతల కు నిజంగా చీము నెత్తురు ఉంటే.. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు.. మీ పార్టీ ప్రధాని స్థాయి, హోదా మరిచిపోయి.. నీచ రాజకీయాలతో జోకర్, బఫూన్ టైపులో చేసిన హావభావాలు చూస్తే సిగ్గేస్తుందన్నారు. దళిత, మైనారిటీ వ్యతి రేక, తెలంగాణ, రైతాంగ వ్యతిరేక బీజేపీని తెలం గాణ ప్రజలు తరిమికొట్టాలి.. కేసీఆర్ చేతిలోనే రాష్ట్రం సుభిక్షంగా సురక్షితంగా.. ఆయనే శ్రీరామ రక్ష అని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సమావేశంలో లింగాలఘనపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, కోమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ సెవెల్లి సంపత్, బీఆర్ఎస్ నాయ కులు చిట్ల ఉపేందర్‌రెడ్డి, పోకల శివకుమార్, ముసిగుంపుల ఆంజనేయులు ఉన్నారు.