రాయపర్తి : పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని మొరిపిరాల, శివరామపురం గ్రామాలలో సిసి రోడ్లు, వాటర్ ప్లాంట్ నిర్మాణ పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని పలుమార్లు కలుస్తూ నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానన్నారు.
అనంతరం ఇరు గ్రామాల్లో జరిగిన దుర్గామాత ఉత్సవాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, తొర్రూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, కుందూరు గోపాల్ రెడ్డి, తిరుమల మాడభూషణ కృష్ణమాచార్యులు, మందాడి సుదర్శన్ రెడ్డి, పెండ్లి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.