జనగామ, ఆగస్టు 22 (నమస్తే తెలంగా ణ): సీఎం రేవంత్‌రెడ్డి దేవు ళ్ల మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టులోపు రూ. రెం డు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలను దగా చేశాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రా వు ధ్వజమెత్తారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జనగామ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై తొలుత తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి, ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవీప్రసాద్, క్యామ మల్లే శం, రాకేశ్‌రెడ్డితో కలిసి ధర్నాలో పాల్గొని హరీశ్‌రావు మాట్లాడారు. వందశాతం రైతు రుణమాఫీ అయ్యిందా? ఏ ఊరికొస్తావో చెప్పు.. ఏ మండలానికి వస్తావో చెప్పు..కాలేదని మేం నిరూపిస్తాం అని సవాల్ చేశారు. మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని, ఎవరి మాట నమ్మాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారని హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీ విషయంలో దేవుడిపై ఒట్టు పెట్టి ప్రజలను మోసం చేశానని తప్పు ఒప్పుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాప పరిహారం చేయాలని అన్నారు.
రేవంత్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఎనిమిది నెలల వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ అమలు చేసేలా ప్రభుత్వం మెడలు వంచుతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 11 విడత ల్లో రూ. 70వేల కోట్లు రైతు బంధు ఇచ్చి రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఏ ఒక హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. మా కార్యకర్తలను ఎకడ ఇబ్బంది పెట్టినా, భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని, పోలీసు అధికారులు జాగ్రత్త అంటూ హరీశ్ హెచ్చరించారు.
పంటలకు బోనస్ అని బోగస్ చేశారని, రుణమాఫీని బొగ్గుబాయి కార్మికులకు, ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేయడం లేదని.. ఐటీ నిబంధనలని ఆశ వరర్లు, ఆంగన్వాడీలకు కోతలు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే రేవంత్ సర్కారు నిర్వీ ర్యం చేస్తున్నదన్నారు. ధర్నాలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, మార్కెట్ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇర్రి రమణారెడ్డి, గద్ద నర్సింగరావు పాల్గొన్నారు.
అర్హులందరికీ రుణమాఫీ అందేలా సర్కారు మెడ లు వంచుతాం. జనగామలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మార్కెట్‌కు వెళ్లి నిలదీసి మద్దతు ధర కోసం కొట్లాడాం. అదే స్ఫూర్తితో రైతు రుణమాఫీలో కూడా న్యాయం జరిగే వరకు వెంట ఉంటాం. పాక్షికంగా రుణమాఫీ పథకం అమలు చేసి సంపూర్ణమంటూ రేవంత్‌రెడ్డి దొంగమాటలు చెప్పాడు. డిసెంబర్లో చేయాల్సిన రుణమాఫీ ఆలస్యం చేసి వడ్డీ చెల్లించలేదని వేలాది మంది రైతులకు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. రుణాలను మాఫీ చేసి వెంట నే కొత్త రుణాలు ఇవ్వాలి. అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలి. రైతు భరోసా నిధులను విడుదల చేయాలి. చిన్నచిన్న సాంకేతిక కారణాలను సాకుగా చూపి రుణమాఫీ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నది.
ముఖ్యమంత్రి మాయమాటలు.. దేవుళ్లపై ఒట్లు పెట్టుకొని చేసిన దగాను రైతులు, ప్రజలు గమనిస్తున్నారు. ఇకపై ఎంత మాత్రం ఆయన ఆటలు సాగవు. ఇందిరమ్మ రాజ్యం..ప్రజాపాలనలో మాట్లాడే హక్కును కాంగ్రెస్ హరిస్తున్నది. ప్రజల తరపున బీఆర్ఎస్ ప్రశ్నించి అండగా నిలుస్తుంది. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదనే దానికి మంత్రులు ప్రకటనలే నిదర్శనం. 49 లక్షల మందికి చేయాల్సిన రుణమాఫీ 22 లక్షల మంది రైతులకు మాత్ర మే అయిందని ఒప్పుకున్నది నిజం కాదా?