రేగొండ, డిసెంబర్ 8 : ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. రేగొండ మండలంలోని రంగయ్యపల్ల్లె, దుంపిల్లపల్లె, జూబ్లీనగర్, కనిపర్తి, వెంకటేశ్వర్లపల్ల్లె, రామగుండాలపల్ల్లె, భాగిర్ధిపేట గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డుసభ్యుల అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ర్యాలీ నిర్వహించి వారి తరఫున ప్రచా రం చేశారు.
ఈ సందర్భంగా మధుసూదనా చారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు న్న వారిని గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరిపించాలని పేర్కొన్నారు. రైతులకు సరిపడా యూరియా సరాఫరా చేయకపోవడమే కాకుండా ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాము, సదానందం, భిక్షపతి, నర్సింగరావు ఉన్నారు.