న్యూశాయంపేట, ఏప్రిల్ 5 : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ దేయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ పరిధి 31వ డివిజన్ వాసవి కాలని, దుర్గాదేవి కాలని, ప్రశాంత్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. డివిజన్లోని ప్రతి వార్డులో రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ల నిర్మాణం చేపడుతామని అన్నారు.అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
మంజూరు చేసిన పనులను నిర్నీత సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ వేల్పుల మోహన్ రావు, డివిజన్ అద్యక్షుడు అన్కేశ్వరపు సురేందర్, వాసు పాల్గొన్నారు.