వరంగల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గార మండలాల్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించారు. అక్కడి పలు గ్రామాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ విద్యుత్ మోటర్లకు బిగించిన మీటర్లను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..మోటర్లకు మీటర్లు బిగించడం వల్ల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని రైతులు కోల్పోతారన్నారు. రైతులకు వ్యవసాయం భారంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తూ ప్రజా వ్యతిరే విధానాలకు పాల్పడుతుందన్నారు.
నల్ల చట్టాలతో సాగును నిర్వీర్యం చేయాలని చూసిన బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలతో దేశాన్ని ప్రైవేట్ శక్తులకు అమ్మాలనుకుంటుందని ఆరోపించారు. ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు.