నర్సంపేటరూరల్, జూన్ 8: బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో నేడు రాష్ట్రంలోని రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాదన్నపేట పెద్ద చెరువుకట్టపై గురువారం చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై చెరువుకట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదారమ్మతల్లికి జలహారతి ఇచ్చి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషి వల్ల వ్యవసాయ రంగంలో నేడు రాష్ట్రం ఎనలేని పురోగతి సాధించిందన్నారు. రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని ప్రజలు గమనించాలని కోరారు.
ప్రభుత్వ సహకారంతో మిషన్ కాకతీయ పథకం ద్వారా నర్సంపేట డివిజన్లోని 272 చెరువులను రూ. 66 కోట్లతో అభివృద్ధి చేసి, 35 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. రూ. 36 కోట్లతో 13 చెక్‌డ్యామ్‌లు, రూ. 8 కోట్లతో మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్ పూర్తి చేసి బోటింగ్ సౌకర్యం కల్పించామన్నారు. రూ. 3 కోట్లతో పాకాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు. రంగాయ చెరువు ప్రాజెక్టు నుంచి మాదన్నపేట పెద్ద చెరువుకు గోదావరి జలాలు తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ సంపత్‌రావు, సీపీవో జీవరత్నం, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి, తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఎంపీడీవో అంబాల శ్రీనివాసరావు, నర్సంపేట టౌన్ సీఐ పులి రమేశ్‌గౌడ్, ఎస్సై సురేశ్, మాదన్నపేట సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, కౌన్సిలర్లు జుర్రు రాజు, పాషా, దార్ల రమాదేవి, మచ్చిక నర్సయ్యగౌడ్, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల అభివృద్ధి కోసం కృషి
నల్లబెల్లి: రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రంగాయ చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్ది మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ర్టాన్ని సాధించుకున్నామని, సీఎం కేసీఆర్ పాలనలో నేడు ఆశించిన ఫలితాలు వస్తున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలోని బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయన్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. ప్రజలు మరోసారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ దూలం మంజుల, ఎంపీపీ ఊడుగుల సునీత, మండల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, ఇరిగేషన్ ఈఈ సాల్మాన్రాజ్, డీఈ రవి, ఏఈ పవిత్ర, ఆర్ఐ రాజేంద్రప్రసాద్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు బానోత్ పూల్‌సింగ్, వెంకట్‌రెడ్డి, గోనె శ్రీదేవి, అమరేందర్‌రెడ్డి ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ గోనెల పద్మ పాల్గొన్నారు.
ఏడాదికి రెండు పంటలు
చెన్నారావుపేట: మిషన్ కాకతీయ పథకం ద్వారా సీఎం కేసీఆర్ చెరువులను పునఃరుద్ధరించిన తర్వాత రైతులు ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అమీనాబాద్, లింగగిరిలో జరిగిన చెరువుల పండుగకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు బతుకమ్మలు, కోలాటాలతో ఆనందోత్సాహల నడుమ చెరువు కట్టపైన వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసిందని పెద్ది అన్నారు. చెన్నారావుపేటలో సర్పంచ్ కుండె మల్లయ్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు రఫీ, అమీనాబాద్ పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి, మాజీ ఎంపీపీ జక్క అశోక్ తదితరులు పాల్గొన్నారు.
జీవితలక్ష్యం నెరవేర్చుకున్నా : పెద్ది
ఖానాపురం: పాకాలకు గోదావరి జలాలను తీసుకురావడంతో తన జీవిత లక్ష్యం నెరవేరిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఖానాపురంలో నిర్వహించిన చెరువుల పండుగకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఎత్తుకొని ర్యాలీగా తుంగబంధం కాల్వ వద్దకు చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఖానాపురం, అశోక్‌నగర్‌లో నిర్వహించిన ప్రచార సభల్లో పాకాలకు గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నట్లు తెలిపారు. చెరువుల పండుగకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఎంపీడీవో సుమనావాణి, నర్సంపేట ఏసీపీ సంపత్‌కుమార్, రూరల్ సీఐ సూర్యప్రసాద్, ఎస్సై తిరుపతి, సర్పంచ్ చిరంజీవి, ఉపసర్పంచ్ కుమార్, కార్యదర్శి సుప్రజ, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.