చెన్నారావుపేట/ఖానాపురం, ఏప్రిల్17: అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. చెన్నారావుపేట, పాపయ్యపేట, ఉప్పరపల్లి, అక్కల్చెడ, కోనాపురం, లింగాపురం, ఖానాపురం మండలం అశోక్‌నగర్ క్లస్టర్ పరిధి గ్రామాల్లో గతేడాది జనవరిలో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు సోమవారం ఆయన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి బాధలు గుర్తించి కన్నీళ్లను తుడిచే నాయకుడే సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో మొట్ట మొదటిసారి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందజేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. అదేవిధంగా ఇటీవల నియోజకవర్గంలో వడగండ్ల వానకు పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి ఎకరాకు రూ. 10 వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని, ఆయన ఆదేశాల మేరకు పంట నష్టంపై నిర్వహిస్తున్న సర్వే పూర్తి కావొచ్చిందన్నారు. నష్ట పరిహారానికి సంబంధించిన జీవో త్వరలో విడుదల విడుదల కానుందని తెలిపారు. మీ ఆశీస్సులతో గెలిచానని, తన శక్తిమేర పనిచేస్తానని అన్నారు. రైతులు పంటలు నష్ట పోయినప్పుడు ప్రతిపక్షాలకు కనీస పట్టింపైనా లేదని విమర్శించారు. తన చిన్నతనంలో నర్సంపేట ఎమ్మెల్యే ఓంకార్ మాటలు రేడియాలో వినేవాడినని, తాను ఎన్నటికైనా ఎమ్మెల్యేగా గెలిచి రైతు లను ఆదుకోవాలని చిన్ననాడే నిశ్చయించుకున్నానని తెలిపారు.
నష్ట పరిహారం చెక్కులు అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అశోక్‌నగర్‌కు చెందిన జాటోత్ ఈర్య కూతురు వివాహం చేసే క్రమంలో 2022 జనవరిలో కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతినగా, అప్పుడు పంటల పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే పెద్ది బాధిత రైతును ఓదార్చారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ మేరకు సోమవారం ఈర్యకు పంటనష్ట పరిహారం చెక్కును అందజేయగా, రైతు ఆనందం వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో ఎంపీపీలు బదావత్ విజేందర్, వేములపల్లి ప్రకాశ్‌రావు, వైస్ ఎంపీపీ రామసహాయ ఉమారాణి, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరావు, జడ్పీటీసీ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, ఆర్బీఎస్ మండల కన్వీనర్లు బుర్రి తిరుపతి, కుంచారపు వెంకట్‌రెడ్డి, జిల్లా డైరెక్టర్ తూటి శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, ఏఈఓ నాగరాణి, సంతోష్, సంధ్య, చెన్నారావుపేట, అమీనాబాద్ పీఏసీఎస్ చైర్మ న్లు ముద్దసాని సత్యనారాయణ, మురహరి రవి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చింతకింది వంశీ, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, సర్పంచ్‌లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, శ్రీధర్‌రెడ్డి, సమ్మూనాయక్, కవిత, అశోక్, వెంకన్న, హఠ్యా, మండల కో ఆప్షన్ మెంబర్ గఫార్, క్లస్టర్ ఇన్చార్జి తొగరు చెన్నారెడ్డి, ఎంపీటీసీ విజేందర్‌రెడ్డి, మండల నాయకులు వీరన్న నాయక్, బద్దూనాయక్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే దేశం అభివృద్ధి సాధ్యం
నర్సంపేట రూరల్ : బీఆర్ఎస్తోనే దేశం అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నర్సంపేట మండలంలోని భాంజీపేట గ్రామానికి చెందిన కాం గ్రెస్, బీజేపీలకు చెందిన 25మంది యువకు లు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. నాయకులు శ్రీకాంత్, వంశీ, నర్సింహ, లక్ష్మణ్, అఖిల్, సందీప్, వెంకటేశ్, బాలాజీ, నాగరాజు, సునీల్, గణేశ్, సురేందర్, సాంబరాజ్యంతో పాటు మరో 12మంది యువకులు పార్టీలో చేరగా వీరికి ఎమ్మెల్యే పెద్ది కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో యూత్ మాజీ అధ్యక్షుడు కాలె రాజు, రవి, నర్సింగం, రమేశ్ పాల్గొన్నారు.