MLA Palla Rajeshwarreddy | జనగామ రూరల్, మే 17 : జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామ పరిధి సుందరయ్య నగర్‌కు చెందిన రెడ్డేబోయిన రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇవాళ అక్కడికి చేరుకున్నారు. రాములమ్మ మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంట మాజీ ఎంపీపీ మేకల కళింగ రాజు, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షురాలు బొల్లం శారద, గ్రామ శాఖ అధ్యక్షుడు నామాల భాస్కర్, నాయకులు రామ్మోహన్ రెడ్డి గ్రామస్తులు తదితరులు ఉన్నారు.