జనగామ, ఆగస్టు 30(నమస్తే తెలంగా ణ): ‘దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం రూ.200 కోట్లు కేటాయించండి.. జనగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కోరారు.
శుక్రవారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన పార్లమెంట్‌స్థాయి నీటి పారుదల శాఖ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని తపాస్‌పల్లి రిజర్వాయర్ 4 మోటర్లు ఆన్‌చేసి చెరువులు నింపాలని కోరారు. నియోజకవర్గ ప్రజల తరపున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.