బచ్చన్నపేట ఏప్రిల్ 15 : బచ్చన్నపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బొమ్మెన ఆంజనేయులు గౌడ్ తండ్రి బొమ్మెన గణపతి గౌడ్ ఇటీవలే మరణించారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అధైర్య పడొద్దు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, తాజా మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గంధమల్ల నరేందర్ , సీనియర్ నాయకులు పందిపెళ్లి సిద్ధిరాంరెడ్డి, ఎండీ అజీమ్, బొడిగం గోవర్ధన్ రెడ్డి, కక్కెర్ల విజయ్, కుకుడాల పుల్లయ్య, తప్పెట్ల వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.