చిల్పూరు, నవంబర్ 22 : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో తెలంగాణవాదానికి విత్తనాలు పడినప్పుడు మొదటగా మొలకెత్తిన వారు దివంతగ జడ్పీ మాజీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని రాజవరం గ్రామంలో శుక్రవారం సంపత్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నికార్సైన నా యకుడు సంపత్ రెడ్డి అని, పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తి అని కొనియాడారు. ఉద్యమకారుడు సంపత్‌రెడ్డికి మంచి పదవి కట్ట బెట్టాలని ప్రతిసారి కేసీఆర్ గుర్తు చేసేవారు.
చాలా మంది ఉద్యమకారులు పోటీ పడే సందర్బంలో అ త్యంత సీనియర్ సంపత్ రెడ్డికి రావాలని ఉమ్మడి నిర్ణయం తీసుకుని జడ్పీ చైర్మన్‌ను చేశామని తెలిపారు. కేసీఆర్‌కు పాగాల సంపత్‌రెడ్డి అంటే ఎనలేని ప్రేమ, అందుకే పార్టీ జిల్లా మొదటి అధ్యక్షుడిగా సంపత్ రెడ్డిని చేసుకున్నామని పేర్కొన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ, మాపై ఉందన్నారు. రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతోనే సంపత్‌రెడ్డి ఉద్యమంలోకి వచ్చారని, ఆయన ఏదయితే ఆశించాడో అది సాధించామని, అదే స్ఫూర్తితో తెలంగాణ బాగు కోసం కేసీఆర్ అడుగు జాడల్లో నడుద్దామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సంపత్‌రెడ్డి భార్య సుజాతారెడ్డి, కుమార్తె సంజనారెడ్డి, తండ్రి జయపాల్ రెడ్డి, అన్నదమ్ములు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ సుధీర్‌కుమార్, జిల్లా గంథ్రాలయ మాజీ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ జనగామ యాదగిరి, కొమురవెల్లి ఆలయ చైర్మన్ సంపత్, నియోజకవర్గ కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్‌రెడ్డి, జనగామ బీఆర్ఎస్ యూత్ నాయకుడు కేశిరెడ్డి రాకేశ్‌రెడ్డి, మాలోత్ రమేశ్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రంగు హరీశ్, మాజీ సర్పంచ్ ఉద్దమారి రాజ్‌కుమార్, బీఆర్ఎస్ రాజవరం, చిన్నపెండ్యాల, కొండాపూర్, నష్కల్ గ్రామ అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా, గుంటి భీములు, గాలి ప్రవీణ్, అరూరి స్వామి, నాయకులు మామిడాల లింగారెడ్డి, ఇల్లందుల సుదర్శన్, గజ్జెల దామోదర్, మారెపల్లి శ్యామ్‌కుమార్‌రెడ్డి, మారెపల్లి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.