బచ్చన్నపేట ఏప్రిల్ 24 : ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉప్పెనల కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బచ్చన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసున్న సందర్భంగా వరంగల్లో సభ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఇందు గాను బచ్చన్నపేట మండలం కార్యకర్తలు నాయకులు, అభిమానులు జాతరల తరలి వెళ్లాలన్నారు. ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఆవిష్కరించి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఈ విషయాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేయాలన్నారు.
కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పూర్ణచందర్, మాజీ ఎంపీపీ బావల నాగజ్యోతి కృష్ణంరాజు, రైతు బంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, కనకయ్య, పి ఎస్ సి ఎస్ వైస్ చైర్పర్సన్ మద్దికుంట రాధా, నాయకులు వడ్డేపల్లి మల్లారెడ్డి, కొండి వెంకటరెడ్డి, నరేందర్, షబ్బీర్, చల్ల శ్రీనివాసరెడ్డి, కొప్పురప్ప శ్రీనివాస్ రెడ్డి, ప్రతాపరెడ్డి, మల్లేశం, భాస్కర్, హరి ప్రసాద్, పంజాల రాజు, అజాం, శివకుమార్, సిద్ధారెడ్డి ,కిష్టయ్య, ఫిరోజ్, సిద్ధారెడ్డి, కనకయ్య, జనార్ధన్, కోనేటి స్వామి, ముసిని రాజు గౌడ్, శ్రీశైలం గౌడ్, రాజనర్సు, వేణుగోపాల్, కైసర్ తదితరులు పాల్గొన్నారు.