హన్వాడ, ఫిబ్రవరి 20 : ఒక కుటుంబంలో కొడుకు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడగా కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి సైతం హఠాన్మరణం పొందిన ఘటన శుక్రవారం హ న్వాడ మండలం పెద్దదర్పల్లిలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దదర్పల్లికి చెందిన దొబ్బడి కృష్ణయ్య(40) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కుటుంబ సమస్యతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం తెల్లవారుజామున చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు నిద్రలేచే సరికి కృష్ణయ్య మృతి చెంది కనిపించాడు. కొడుకు మృతిని తట్టుకోలేని తల్లి దొబ్బడి బాలమ్మ(80) ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యు లు వెంటనే ఆమెను ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మ్పతి చెందిన క్పష్ణయ్యకు భార్యతోపాటు కుమారుడు, కుతూరు ఉన్నారు. ఒకే ఇంట్లో తల్లీకొడుకు మ్పతి చెందడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యుల రోదనలు చూసి కంటతడి పెట్టుకున్నారు.