తరిగొప్పుల,మే 15 : మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనని సంప్రదించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండలంలోని బొత్తలపర్రె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముందావర్ శ్రీరాములు కుమార్తె నీల వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రజలకు ఏ కష్టమొచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి చిలివేరి లింగం, మాజీ సర్పంచ్ భూక్య కమల రవి, మాజీ ఎంపీటీసీ భూక్యా జూంలాల్ నాయక్, నాయకులు ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్, భూస యాదయ్య, అంకం రాజారాం, తాళ్లపల్లి పోచయ్య పాల్గొన్నారు.