బచ్చన్నపేట నవంబర్ 16 : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామంచర్ల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని వారు కురుమ సంఘం జిల్లా రాష్ట్ర జిల్లా నేతలు ఎగ్గే మల్లేశం, క్యామ మల్లేశం లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేమిడి కనకరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గుండెను ఎదురుగా పెట్టి పోరాడిన మహా యోధులు దొడ్డి కొమురయ్య అని ప్రశంసించారు.
భూమి కోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆయన ఆశయ సాధనకు అంకితభావంతో ముందుండి పోరాటాలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నాటి సాయుధ పోరులో 4000 మంది మరణిస్తే అందులో మొదటి వ్యక్తి దొడ్డి కొమురయ్య అని గుర్తు చేశారు. నాటి పోరాట స్ఫూర్తితో నేడు ప్రతి గ్రామంలో కొమురయ్య విగ్రహలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.అమరవీరుల స్మరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టాలన్నారు. పాఠ్య పుస్తకాల్లో చరిత్ర ముద్రించాలన్నారు.
కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి, మాజీ జెడ్పి చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, యువజన కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి, పలు పార్టీ నేతలు ఇర్రి రమణా రెడ్డి, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనక శివరాజ్ యాదవ్, నాయకులు బి. సిద్ది లింగం. సెవెల్లి సంపత్, మల్లారెడ్డి, జంగిటి విద్యనాథ్, పిన్నింటి కావ్య శ్రీ రెడ్డి, నల్ల నాగుల వెంకటేశ్వర్లు, ఖలీల్ బేగం, బేజాడి బీరప్ప, హరీష్, చౌదర్పల్లి కుమార్, రాజు, ఆయిల్ మల్లయ్య, కిష్టయ్య, సిద్ధారెడ్డి, స్వామి, రాజు గౌడ్, సిద్ధులు, కేమిడి కనకరాజ్, బాపురెడ్డి, రవి, పాపయ్య పాల్గొన్నారు.