నర్మెట, ఏప్రిల్ 25 : మండలంలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన నర్మెట మండల మాజీ జెడ్పిటిసి గాదె మోహన్ రెడ్డి గురువారం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకొని భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఆయన వెంట బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, పెద్ది రాజిరెడ్డి, గద్దల నర్సింగరావు, తేజావత్ గోవర్దన్, ఆమెడపు కమలాకర్ రెడ్డి, నీరేటి సుధాకర్, ఎండీ గౌస్, మంకెన అగిరెడ్డి, నర్రా వెంకట రమణ రెడ్డి, కంతి రాజలింగం, వెలంగిని రెడ్డి, జోజ్రెడ్డి, ఏర్పుల అబ్నేజర్, బెడుదం సుధాకర్, నక్కల రవి, మేకల రాజు, తదితరులు ఉన్నారు.