జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 1 : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ లో వెంటనే అమలు చేస్తామని శాసనసభ సమావేశాల సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పి మాదిగ జాతి ప్రజలను మోసం చేశాడని ఎమ్మార్పీఎ స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలో ఎ మ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించే ‘లక్ష డప్పులు-వేల గొంతులు’ సాం స్కృతిక మహా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక ఎన్ఎంఆర్ గార్డెన్లో నిర్వహించిన సభలో అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాదిగ, మాదిగ ఉప కులాల ప్రతినిధులు పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య, డాక్టర్ సీహెచ్ రాజమౌళి, డాక్టర్ సుగుణాకర్‌రాజు, డాక్టర్ వంశీ హాజరయ్యారు.
మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాటి ఉద్యమ నేత కేసీఆర్ గొంగళి పురుగునై నా ముద్దాడుతానని చెప్పి అన్ని పార్టీల మద్దతు కూడగట్టి విజయం సాధించారని గుర్తు చేశారు. ఇదే తరహాలో నేను కూడా ఎస్సీ వర్గీకరణకు దేశంలో అనుకూలంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు తీసుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారి మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలను మోసం చేస్తూనే ఉందని మందకృష్ణ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట తప్పడం వల్లే మాదిగలు మళ్లీ రోడ్లపైకి రావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఎస్సీ వర్గీకరణ అమలుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. వర్గీకరణ న్యాయమైన డిమాండ్‌గా భావించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గత అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో వర్గీకరణ అమలయ్యే వరకు బీఆర్ఎస్ మంద కృష్ణ ఉద్యమానికి బాసటగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు స్థానిక నెహ్రూపార్కు ఏరియా నుంచి ఎన్ఎంఆర్ గార్డెన్ వరకు వందలాది మంది డప్పు కళాకారులతో కలిసి మంద కృష్ణ మాదిగ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన దళిత సంఘాల నాయకులు రాగల్ల ఉపేందర్, పైసా రాజశేఖర్, పసుల ఏబేల్, గద్దల నర్సింగరావు, బొల్లం శారద, విజయ్, ప్రవీణ్, నవీన్, నీల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.