బచ్చన్న పేట: ఏప్రిల్ 10 : అవగహన లేని ప్రభుత్వం వల్లే పంటలు ఎండిపోతున్నాయని, యాసంగిలో చాలా తక్కువ పంట పండిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డి పల్లి, కొడవటూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వే రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్దత వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. బచ్చన్నపేటకు రావాల్సిన నీరు ఈసారి అందలేదు. మండలంలోని ప్రసిద్ధ గుడిచెరువు మొదటి సారి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.
మూడో దశ దేవాదుల ప్రాజెక్టు నుంచి 1800 క్యూసెక్కుల నీటిని అందించేందుకు నాడు కేసీఆర్ మోటర్లు ఆన్ చేయించారని వెల్లడించారు. టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ఇటీవలే ఒక మోటర్ ప్రారంభమైందని, నెల రోజుల్లో రెండవ మోటర్ కూడా పనిచేయనుందని తెలిపారు. వానాకాలంలో వర్షాలు పడ్డా లేకపోయినా, ఉన్న చెరువులను నింపుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మూడో దశ దేవాదుల ప్రాజెక్టు నుంచి నీరు తీసుకురావడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్ల నాగుల శ్వేత, బచ్చన్నపేట పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు.