వేలేరు, జూలై 11: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. మండలంలోని దేవునూర్ గ్రామంలో మండల మాజీ అధ్యక్షుడు గుడివెనుక దేవేందర్ ఆధ్వర్యంలో పల్లా అభిమానులు కేక్ కట్ చేశారు.
వేలేరు మండల కేంద్రంలో మండల ఇన్చార్జి భూపతిరాజ్ ఆధ్వర్యంలో నాయకులు కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ధర్మసాగర్ మండల ఇన్చార్జి కర్ర సోమిరెడ్డి, మండల మాజీ అధ్యక్షులు మునిగెల రాజు, నర్సింహారావు, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మాజీ వైస్‌ఎంపీపీ సంపత్, కోఆప్షన్ మాజీ సభ్యురాలు జుబేదాలాల్ మహ్మద్, మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, మండల నాయకులు బొడ్డు ప్రభుదాసు, రాజిరెడ్డి, శాతబోయిన రమేశ్, విజయ్‌కుమార్, లక్క శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు గోవింద సురేశ్, కొయ్యడ మహేందర్, సూత్రపు సంపత్, ఇట్టబోయిన సంపత్ పాల్గొన్నారు.