నమస్తే నెట్వర్క్ : తెలంగాణ బహుజన వీరుడు, ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని వక్తలు అన్నారు. ఆదివారం ఆయన జయంతి వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘ నంగా జరుగగా, అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌడ కులస్తులు పాల్గొని ఘన నివాళులర్పించారు.
హనుమకొండ జిల్లా పరకాల, ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క పాల్గొని గౌడ కులస్తులకు కాటమయ్య కిట్స్ పంపిణీ చేశారు. జనగామలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొని పాపన్న చిత్రపటం వద్ద నివాళులర్పించారు. హనుమకొండ బాలసముద్రంలో ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు.