గిర్మాజీపేట, అక్టోబర్ 17: రాబోయే రోజుల్లో పరిశ్రమలను తీసుకొచ్చి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హామీ ఇచ్చారు. 37వ డివిజన్లోని బుడిగ జంగాలకాలనీకి చెందిన 30 మంది యూత్ సభ్యులతోపాటు 12వ డివిజన్‌కు చెందిన బీజేపీ యూత్ నాయకులు వసంత్, సాయి మిత్ర బృందం సోమవారం రాత్రి శివనగర్‌లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నన్నపునేని వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ నగరాభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతూ నిత్యం జనాల్లో ఉంటూ వారి సాదకబాధలను తెలుసుకుంటూ..
వారికి అండగా ఉంటున్న ఎమ్మెల్యే నరేందర్ పనితీరుకు ఆకర్షితులై తాము బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ తూర్పులో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. వరంగల్ బస్‌స్టేషన్, కలెక్టరేట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రూ. 1200 కోట్లతో అధునాతన సౌకర్యాలతో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను త్వరలోనే నగర ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామన్నారు. తనకు మద్దతు తెలుపుతున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత బోగి సురేశ్, 37వ డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు ఎండీ ఫిరోజ్, యూత్ నాయకులు రేవంత్, నిరంజన్, వేణు, కుమార్, ముకేశ్, వీరస్వామి, జోగేందర్, హరిబాబు, కిశోర్, కేశవ్, రమేశ్, కుమారస్వామి, నాగార్జున, వీరేశ్, కుమారస్వామి, శివ, నరేశ్, 12వ డివిజన్ యూత్ నాయకుడు సిరాజ్ పాల్గొన్నారు.