రాజేందర్‌రెడ్డి హనుమకొండ, నవంబర్ 20 : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో గ్రంథాలయాల్లోని పుస్తకాలు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత, విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని, ఆ లక్ష్యాన్ని సాధించి కన్న తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువు కల నెరవేర్చాలన్నారు.
గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చేసినప్పటి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే వివరించారు. గ్రంథపాఠలకు ఉపయోగకరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తునందుకు చైర్మన్ అజిజ్ఖాన్ సేవలను కొనియాడారు. ఇకముందు కూడా గ్రంథాలయంలో నిరుద్యోగులకు, పాఠకులకు ఉపయోగకరమైన వనరులు సమకూర్చాలని నావంతు సహాయ సహకారాలు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే.శశిజాదేవి, స్థానిక కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, నెక్కొండ కవిత, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొమ్మతి విక్రమ్, కాంగ్రెస్ రాష్ర్ట నాయకుడు బిన్ని లక్ష్మణ్, కందుల సృజన్కాంత్, ఆర్టీఐ హనుమకొండ మెంబర్ పలగొండ సతీష్, లైబ్రేరియన్లు మలుసూరు పురుషోత్తంరాజు, జూనియర్ అసిస్టెంట్ పి.సంతోష్‌కుమార్, రికార్డు అసిస్టెంట్ మమత, ఇంటర్నెట్ సెక్షన్ నిర్వాహకులు రాజేష్, పాల్గొన్నారు.