పర్వతగిరి, ఆగస్టు 10: బీసీకాలనీలో సీసీరోడ్డు నిర్మాణ పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రూ. 3 లక్షల నిధులతో 80 మీటర్ల సీసీరోడ్డు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్‌నాయక్, ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, నాయకులు పాల్గొన్నారు.
ఏనుగల్‌లో ఒగ్గుల చిలకమ్మ కుటుంబ సభ్యులను, చింతనెక్కొండలో బీజేపీ నాయకుడు కుడికాల శ్రీధర్ తల్లి సరోజన మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే నాగరాజు పరామర్శించారు. జమాల్‌పురంలో మృతిచెందిన జిల్లా పెద్దులు కుటుంబానికి ధైర్యం చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జిల్లా నర్సయ్యను, కాళ్లు విరిగిన జిల్లా సమ్మయ్యను పరామర్శించారు. చౌటపెల్లిలో ఇటీవల మృతి చెందిన మట్టపల్లి లక్ష్మణ్‌రావు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేశారు. వడ్లకొండలో సీతారామస్వామి ఆలయ పనులను పరిశీలించారు. అలాగే, వడ్లకొండలో ఇటీవల మృతిచెందిన వల్లందాసు సంధ్య, ఉప్పమ్మ, నరుకుడు సాయిలు కుటుంబాలను పరామర్శించారు.