MLA KR Nagaraju | మడికొండ : గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ కడిపికొండ లోనీ మసీదు వద్ద రూ. 20లక్షలు, గ్రేటర్ 64వ డివిజన్ పరిధిలోని మడికొండ వెస్ట్ సిటీలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కావున ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట కార్పొరేటర్లు జలగం అనిత, ఆవాల రాధిక రెడ్డి, నాయకులు ఉన్నారు.