వేలేరు : పేద వర్గాల పాలిట కల్యాణ లక్ష్మి పథకం వరంగా మారిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘనపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కుల కోసం కానీ, ఇందిరమ్మ ఇండ్ల కోసం కానీ ఎవరైనా డబ్బులు అడిగితే తనకు చెప్పాలని సూచించారు.
డబ్బులు అడిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 29 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కోమి, ఎంపీడీవో లక్ష్మీ ప్రసన్న, మండల వ్యవసాయ అధికారి కవిత, ఎంపీఓ భాస్కర్, ఆర్ఐ సురేందర్, మండల అధ్యక్షుడు కత్తి సంపత్, మల్లికార్జున్, రాజిరెడ్డి, రవీందర్ యాదవ్, బిల్లా యాదగిరి, సద్దాం హుస్సేన్, లక్ష్మణ్ నాయక్, ప్రమోద్ రెడ్డి, సలీం మాలిక్, తదితరులు పాల్గొన్నారు