టేకుమట్ల, మార్చి 15 : పదవిలో ఉన్నా, లేకున్నా ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యానారాయణరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రూ. 3 కోట్లతో నిర్మించనున్న ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలకు ఆయన అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శంపస్థాపన చేశా రు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికలప్పుడు చేయాలని, మిగతా సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలన్నారు. టేకుమట్ల నుంచి అంకుషాపూర్, సోమనపల్లి, సుబ్బక్కపల్లి మీ దుగా చిట్యాల మండలం నవాబుపేట వరకు డబుల్ రోడ్డు నిర్మించి తీరుతానన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యేతో కలిసి గర్మిళ్లపల్లి- ఓడెడ్, బూర్నపల్లి-కిష్టంపేట గ్రామాల మధ్యలోని మానేరు వాగుపై వంతెనలు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల మౌలిక వసతులకు రూ. 5 లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమం లో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో అనిత, డీఈ రవీందన్, ఏఈ రాజయ్య, ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కోటగిరి సతీశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల రవీందర్, కృష్ణారెడ్డి, కత్తి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి : వేసవి కాలంలో మండల ప్రజలకు తాగు, సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ యార సుజాతా సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించి మండల సభ లో ఆయన పాల్గొని మాట్లాడారు. జడ్పీటీసీ సదయ్య, సొసైటీ చైర్మన్ నర్సింగరావు, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో జయశ్రీ, అధికారులు పాల్గొన్నారు.