వరదలపై రాజకీయం వద్దు.. చేతనైతే బాధితులకు భరోసా ఇవ్వండి
రాజకీయం చేయకుండా చేతనైతే వరద బాధితులకు భరోసా కల్పించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 9, 10, 11, 29 డివిజన్లలో వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ రిజ్వానా బాషా, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ టీమ్‌లతో ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు.
- ముంపు ప్రాంత ప్రజలకు అండగా ఉంటా : చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
- 9,10,11,29 డివిజన్లలోని వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
- పలువురికి ఆహార పదార్థాలు, నీరు అందజేత
హనుమకొండ, జూలై 28: రాజకీయం చేయకుండా చేతనైతే వరద బాధితులకు భరోసా కల్పించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 9, 10, 11, 29 డివిజన్లలో వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ రిజ్వానా బాషా, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ టీమ్‌లతో ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. ప్రకృతి విపత్తు, అకాల వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న నగర ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాకతీయకాలనీ ఫేస్ 1, ఫేస్ 2, అలంకార్, పెద్దమ్మగడ్డ, రామన్నపేట్, రంగంపేట్ ముంపుప్రాంతాల్లో పర్యటించారు. అవసరమైన చోట ప్రొటెక్షన్ వాల్స్, నాలాల పూడికతీత, నాలాల ఆక్రమణపై నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాలు చేయకుండా అకాల వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న నగర ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకు సహకరించాలన్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు, నీరు అందజేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడామని, ప్రజల సంక్షేమం కోసం, నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెస్తామని తెలిపారు.
అన్ని విధాలా అండగా ఉంటా
గిర్మాజీపేట/కాజీపేట: వరద ముంపు అన్ని విధాలా అండగా ఉంటానని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. 29వ డివిజన్ వరద ముంపు ప్రాంతాలైన రామన్నపేట, రఘునాథకాలనీ ప్రాంతాల్లో అన్నారు. శుక్రవారం ఆయన మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్లతో కలిసి పర్యటించారు. బాధితులకు ఆహారపు ప్యాకెట్లు అందించారు. ఆయన మాట్లాడుతూ ఉండాల ని, మీకు ప్రజాప్రతినిధులం, అధికారులు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, మామునూరి రాజు, ఇజ్జగిరి భీమ్రాజ్, మంద చంటి, మార్త కిరణ్, గొర్రె అరుణ్, మైదం కర్ణాకర్, గద్వాల కృష్ణవేణి పాల్గొన్నారు.
62వ డివిజన్లో..
కాజీపేట పట్టణం 62వ డివిజన్లోని వైఎస్సార్ నగర్‌లోని వరద ముంపు బాధితులకు చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ శుక్రవారం భోజనాలు ఏర్పాటు చేసి, స్వయంగా వడ్డించారు. అంతకుముందు గుడిసెవాసులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి లతా వెంకట్ ఆర్థో, జనరల్ సర్జన్ దవాఖానలో చికిత్స పొందుతున్న బత్తిని అనితా రాజేందర్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు రావుల సదానందం, సుంచు అశోక్, బీఆర్ఎస్ నాయకులు సుంచు క్రిష్ణ, పాలడుగుల శివకుమార్, సయ్యద్ సర్వర్, తేలు సారంగపాణి, సోనీ, అయ్యాల దానం, రఘు, బెదరికోట రంజిత్, వినయ్, అనిల్, మహమూద్, కొంతం మల్లేశ్, బొక్క రమేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

