గీసుగొండ, ఆగస్టు 29 : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్, ఓ బ్రోకర్ అని, అతని మాటలు నమ్మి మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండల కేంద్రంలో అకాల వర్షంతో పంట నష్టపోయిన 1,953 మంది రైతులకు రూ1.95కోట్ల పరిహారం చెక్కులను మంగళవారం పంపిణీ చేశా రు. అనంతరం మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్లో దివ్యాంగులకు ప్రభుత్వం పెంచిన రూ.4016 పింఛన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గీసుగొండ మండల కేంద్రం నుంచి నుంచి ఎస్ఎస్ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గార్డెన్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనేక పార్టీల నాయకులు వస్తారని, ప్రజలు వారిని నమ్మి మోసపోవద్దన్నారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు అధికారంలో ఉండి కరెంటు, నీళ్లు రైతు బంధు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన నాయకులు ఇప్పుడు వచ్చి నీతులు చెబుతున్నారన్నారు. తెలంగాణను దోచుకున్నది ఎవరు? ఆగం చేసింది ఎవరో? ప్రజలు గమనించాలన్నారు. సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ చేయగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. రాష్ట్ర అభివృధ్ధి జెట్ స్పీడ్‌తో సాగుతోందన్నారు. రాష్ట్రం సాధించిన నాయకుడు మన కండ్ల ముందు ఉన్నడని, ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేస్తున్నడని, మళ్లీ మీరంతా ఆశీర్వదిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.
రైతులకు 24 గంటల కరెంటుతో పాటు రైతు బంధు, రైతు బీమా ఇస్తునే రుణ మాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. పరకాల నియోజకవర్గంలో దళితబంధు, బీసీ, మైనార్టీలకు రుణాలు ఇచ్చామన్నారు. ప్రతి నెలా అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. అభివృద్ధి చేస్తున్న నాయకుడికి అండగా ఉండాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇక్కడి సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాలన్నారు. గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఇండ్లు ఇస్తామన్నారు. వారికి ఉచితంగా బసు పాసులను కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. దసరా వరకు పార్కులో కిటెక్స్ వస్త్ర పరిశ్రమ ప్రారంభమవుతుందన్నారు.
కోనాయిమాకుల లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి గీసుగొండ, సంగెం, చెన్నారావుపేట మండలాల్లోని 1450 ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. పరకాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ప్రజలు మళ్లీ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. గీసుగొండ మండలంలో అన్ని గ్రామాల్లో రోడ్లు వేసుకున్నామని, అభివృద్ధిలో పరకాల దూసుకెళ్తుందన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్‌రావు, ఏడీఏ సురేశ్‌కుమార్, సంగెం ఎంపీపీ కళావతి, గీసుగొండ, సంగెం జడ్పీటీసీలు పోలీసు ధర్మారావు, గూడ సుదర్శన్‌రెడ్డి, గీసుగొండ వైస్‌ఎంపీపీ రడం శ్రావ్యా భరత్, ఎంపీడీవోలు వీరేశం, వెంకటేశ్వర్రావు, ఏవో హరిప్రసాద్‌బాబు, ఎంపీటీసీ వీరారావు, సర్పంచ్‌లు దౌడుబాబు, రాధాబాయి, గాజర్ల గోపి, రమ, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, బీఆర్ఎస్ గీసుగొండ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, సర్పంచ్‌లు జైపాల్‌రెడ్డి, నాగేశ్వర్రావు, ప్రకాశ్, మల్లారెడ్డి, రజిత, ఆంగోత్ కవిత పాల్గొన్నారు.