వెంకటాపూర్, అక్టోబర్ 28: సీఎం కేసీఆర్ ఆశీర్వదించి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారని, ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శనివారం మండల కేంద్రంలో సుమారు రెండు వేల మందితో ఏర్పాటు చేసిన బంజారాల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బీజేపీ, కాంగ్రె స్ నాయకులకు ఓట్లు వేస్తే గెలవగానే ఛత్తీస్‌గఢ్, ఢిల్లీల్లో తిరుగుతారని, ప్రజా సమస్యలను పట్టించుకోరని తెలిపారు. తాను పేదింటి బిడ్డనని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో తోడుంటానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమం కో సం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, రైతు బంధును ఆపాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వారిని గ్రామాల్లో తిరగనివ్వదని పిలుపునిచ్చారు. తండా వాసులకు పక్కా ఇళ్లు నిర్మించాకే తాను ఇల్లు కట్టుకుటానని తెలిపారు. గ్యారెంటీ లేని వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఆలోచించి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని సూచించారు.
రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేని కుట్రదారులను తరిమి కొట్టాలన్నారు. తనకు అవకాశమిచ్చి అభివృద్ధికి పట్టం కట్టాలని, మూడో సారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలన్ని అమలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం మూడు మండలాల ఇన్చార్జి సాంబారి సమ్మారావు మాట్లడుతూ.. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ జైలు, బెయిలుతోనే గడిచాయని, ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన బడే నాగజ్యోతిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు భూక్యా దేవ్‌సింగ్, మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు ధరంసింగ్, మల్క రమేశ్, అర్జున్‌నాయక్, తిరుపతి, సదన్లాల్, జగన్, జగరాం, గణేశ్, రాజు, రవి, కిషన్, రఘువీర్, కూరెళ్ల రామచారి, మందల శ్రీధర్‌రెడ్డి, చంటి భద్రయ్య, నాయకులు, బంజారా సోదరులు పాల్గొన్నారు.
మల్లూరు ఆలయంలో ప్రత్యేక పూజలు
మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో శనివారం బీఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, రోడ్లు భవనానల కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ నూతిలకంటి ముకుందం, అర్చలు సంప్రదాయంగా స్వాగతం పలికి గోత్రార్చనలు నిర్వహించారు. స్వామి శేష వస్ర్తాలు, చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. పూజలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, ఎరంగారి మోహన్‌రావు, అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చందుశర్మ, సుధీర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నాగజ్యోతి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి
ములు గు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వలసల పరంపర కొనసాగుతున్నది. ‘బైబై సీతక్క… వెల్కమ్ జ్యోతక్క’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర రెడ్కో చైర్మన్, ములుగు మండల ఎన్నికల ఇన్చార్జి ఏరువ సతీశ్‌రెడ్డి అన్నారు. శనివారం ములుగులో కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ అనుముల సురేశ్ శిరీషతో పాటు పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి సతీశ్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి బిడ్డ అయిన బడే నాగజ్యోతి ప్రజాసేవను వారసత్వంగా అందుకొని పోరాట యోధుడి కుమార్తెగా ఎన్నికల బరిలో నిలిచిందని, ఆమె గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో కొనుకటి రవీందర్, పోసాని సాయి, బద్దుల నవీన్, ప్రవీణ్, చాగంటి మల్లేశ్, బానోత్ స్వామి, తప్పిడి శివ, షేక్ పాషా, బజ్జల ఓదేలు, యాదండ్ల కుమార్, మర్రికుక్కల రాజు, సోల తరుణ్, గుగులోత్ శివ, వెనకొల్లు సుధాకర్, అంబాల రాజు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, ములుగు పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, సీనియర్ నాయకులు కాకి పురుషోత్తం, మేర్గు సంతోష్, గజ్జి నగేశ్, అరుణ్ పాల్గొన్నారు.