Home
Warangal-rural
Mla Aruri Ramesh Participated Chairman Marneni Ravinder Rao Anointed The Portrait Of Cm Kcr In Front Of Dcc Bank In Nakkalagutta
రుణమాఫీపై అన్నదాతల సంబురం
ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేస్తున్న సీఎం కేసీఆర్‌పై అభినందనలు, కృతజ్ఞతల వర్షం కురిపిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు గురువారం సంబురాలను అంబరాన్నంటేలా నిర్వహించారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలు, పూలతో ఘనంగా అభిషేకాలు చేశారు.
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన వేడుకలు
- పటాకులు కాల్చి.. స్వీట్లు పంచిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు
- ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలు, పూలతో అభిషేకాలు
- ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు
ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేస్తున్న సీఎం కేసీఆర్‌పై అభినందనలు, కృతజ్ఞతల వర్షం కురిపిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు గురువారం సంబురాలను అంబరాన్నంటేలా నిర్వహించారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలు, పూలతో ఘనంగా అభిషేకాలు చేశారు. అన్నదాతలు పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంపిణీ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ వల్లే నేడు వ్యవసాయం పండుగలా మారిందని, దేశానికి అన్నంపెట్టే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే రుణమాఫీ కూడా చేసి అండగా నిలిచారని, రైతుల మేలును ఎప్పటికీ ఆకాంక్షించే కేసీఆర్వెంటే తామంతా ఉంటామని స్పష్టం చేశారు. మడికొండలో జరిగిన సంబురాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొనగా, నక్కలగుట్టలోని డీసీసీ బ్యాంక్ ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి చైర్మన్ మార్నేని రవీందర్రావు క్షీరాభిషేకం చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 3

నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 3: రైతు రుణమాఫీపై గురువారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చిత్రపటాలకు పూలు, పాలాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్ సంబురాలు జరిపారు. మహబూబాబాద్‌లో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, బయ్యారంలో జడ్పీ చైర్పర్సన్ బిందు ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా రైతులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పాల్గొన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం, వెంకటాపూర్ మండలాల్లో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్, నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపురం, నల్లబెల్లి, వర్ధన్నపేట మండలాల్లో పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. హనుమకొండ నగరంలోని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంతో చైర్మన్ మార్నేని రవీందర్రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మడికొండలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

