వరంగల్ : పల్లెలను ప్రగతి పథంలో నిలుపడంలో సీఎం కేసీఆర్ కేసీఆర్ దేశంలోనే ముందంజలో ఉన్నారని వర్ధన్నపేట ఆరూరి రమేశ్ అన్నారు. బుధవారం పర్వతగిరి మండలం అనంతరం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..స్థానిక సంస్థల బలోపేతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రంమంతో తెలంగాణ పల్లెల రూపురేఖలు మారాయన్నారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు, క్రీడా మైదానాల ఏర్పాటు, ఇంటింటికి తాగు నీరు ఇలా అనేక అభివృద్ది పనులు చేపట్టడంతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పల్లెలకు అందజేస్తున్న అవార్డులే సాక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.