బైక్‌పై వెళ్లి.. సమస్యలు తెలుసుకొని..
అభివృద్ధి, సంక్షేమంలో వర్ధన్నపేట నియోజకవర్గం అగ్రభాగాన నిలుస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
- గ్రేటర్ 46, 64వ డివిజన్లో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పర్యటన
- రూ.13.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- సంక్షేమ ప్రభుత్వాన్ని మరో దఫా గెలిపించాలని పిలుపు
- సుమారు 50 మంది రజకులు బీఆర్ఎస్లో చేరిక
మడికొండ, అక్టోబర్ 2 : అభివృద్ధి, సంక్షేమంలో వర్ధన్నపేట నియోజకవర్గం అగ్రభాగాన నిలుస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గ్రేటర్ 46, 64 డివిజన్లలో కుడా, సీడీఎఫ్, స్మార్ట్‌సిటీ నిధులతో చేపడుతున్న రూ.13.25కోట్ల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డివిజన్లలో బైక్‌పై తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలు, కాలనీల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామన్నారు.
అభివృద్ధి విషయంలో ఎకడా వెనకడుగు వేయకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. విలీన గ్రామాలకు రూ.400 కోట్లు వెచ్చించి, 3 వేలకు పైగా పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. గ్రేటర్ మున్సిపల్లో గ్రామాలను కలిపి గత పాలకులు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ వచ్చినంక ఆ గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. తనపై న మ్మకంతో ఎమ్మెల్యేగా ఎన్నకున్న నియోజకవర్గ ప్రజలకు పెద్ద జీతగానిలా పనిచేస్తున్నానన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
అభివృద్ధి ఫలాలు మీ కళ్ల ముందే కనుబడుతున్నాయని, పేద బడుగు బలహీన వర్గాల్లో సంతోషం చూసేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం తదితర రంగాల్లో విప్లవం సృష్టించినట్లు తెలిపారు. మన కోసం పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నుకుంటే మిగతా పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవాల రాధికరెడ్డి, మునిగాల సరోజన
బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
నయీంనగర్ 2: గ్రేటర్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం గ్రామానికి చెందిన సుమారు 50 మంది రజకులు హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఎమ్మెల్యే అరూరి రమేశ్ నివాసం ఆవరణలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే అరూరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ ఎప్పుడూ కార్యకర్తలను కాపాడుకుంటుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రజితా వెంకటేశ్వర్లు, అటికం రవీందర్, సురేశ్కుమార, సుధాకర్, భాగ్యలక్ష్మి, భగత్, లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

