పేదలకు అండ.. బీఆర్ఎస్ జెండా
పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ సర్కారు నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ 14వ డివిజన్ ఎస్ఆర్నగర్లో వరద బా ధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు
- ఎస్ఆర్నగర్ అభివృద్ధికి కృషి .. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి
- ఇంటింటికీ తిరిగి వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
కాశీబుగ్గ, ఆగస్టు11 : పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ సర్కారు నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ 14వ డివిజన్ ఎస్ఆర్నగర్లో వరద బా ధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాధితులకు సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవడమే కాకుండా అరూరి ఫౌండేషన్ ద్వారా తక్షణ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఆర్నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రత్యేక నిధులు మంజూరు చేసి, మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తూర్పాటి సులోచనా సారయ్య, పార్టీ 14వ డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ, 3వ డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, ఎస్ఆర్నగర్ అధ్యక్షుడు పసులాది మల్లయ్య, నాయకులు పత్రి సుభాష్, మచ్చర్ల స్టాలిన్, పత్రి రాజపోశాలు, రాపర్తి సతీశ్, కేతిరి సమ్మక్క, కొత్తపల్లి అనిల్, సరిత, వనమాల, గౌసియా, పద్మ, రజిత, రాధిక, పిట్టల సంజీవ, జంగం రాజు, మాధవి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం
ఐనవోలు : సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ముల్కలగూడెం, ఐనవోలు, కక్కిరాలపల్లి, నందనం గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ముందుగా ముల్కలగూడెం గ్రామానికి చెందిన ఆత్మ జిల్లా కమిటీ డైరెక్టర్ కుసుంబ దేవేందర్ తండ్రి ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే, ఐనవోలులో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అనంతరం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన గాండ్ల వాణికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష విలువైన చెక్కును, ఐనవోలుకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు రూ.32 వేల విలువ చేసే చెక్కులను వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.
అనంతరం నందనం, రాంనగర్ గ్రామస్తులు సామూహికంగా ఏటా వెళ్లే పెద్దేవుడి వనభోజనాల కార్యక్రమానికి హాజరై గ్రామస్తులతో కలిసి గంపనెత్తిన ఎత్తి ఎమ్మెల్యే ముందుకు సాగారు. గ్రామస్తులతో కలిసి పెద్దేవున్ని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం కొండపర్తి, వనమాలకనపర్తి గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన రూ.2.50లక్షల విలువ చేసే స్వయం ఉపాధి రుణాలను ఎంపీపీ మధుమతి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అందరి ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్అలీ, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సంపత్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ జయపాల్, సొసైటీ వైస్ చైర్మన్లు చందర్రావు, మదాసు బాబు, పార్టీ మండల అధ్యక్షుడు శంకర్రెడ్డి, మండల కార్యదర్శి రాజశేఖర్, మండల కోఆప్షన్ గుంషావలి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

