Y Satish Reddy | మేడారం ఘటనకు మంత్రులదే బాధ్యత : రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
Y Satish Reddy | మేడారం గద్దెల దగ్గర ప్రమాదానికి ముమ్మాటికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ములుగు : మేడారం( Medaram ) గద్దెల దగ్గర ప్రమాదానికి ముమ్మాటికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ( Y Satish Reddy ) డిమాండ్ చేశారు. హన్మకొండలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న మేడాం పూజారి కుమారుడు యువన్ ను ఆయన పరామర్శించారు.
బాలుడి కుటుంబసభ్యులు తమ గోడు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో, కాసుల కక్కుర్తితో ప్రమాదం జరిగి పసివాడు కాలును కోల్పోయి, మరో కాలు విరిగిపోయి ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రి సీతక్క వచ్చి పరామర్శించి రూ.10 వేలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుని పోవడం దుర్మార్గమన్నారు.
వందేళ్లు నిలిచిపోయేలా నిర్మాణాలు చేపడుతున్నామని గప్పాలు చెప్పుకుని, గాలికి ఊడిపోయే నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. కమిషన్లు పంచుకుని, కాసుల కక్కుర్తితో వ్యవహరించిన మంత్రులు బాలుడిని ఆదుకునేందుకు ముందుకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తప్పు ఒప్పుకోవాలని, ఆ పసివాడిని చూసి మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.
బాలుడికి ప్రస్తుతం అయ్యే వైద్య ఖర్చులన్ని ప్రభుత్వమే భరించాలని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక, అతడి భవిష్యత్ కోసం ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలుడి తల్లిదండ్రులిద్దరు చదువుకున్న వారేనని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ప్రతి దానికి సిట్లు, సీబీసీఐడీలు అంటున్న రేవంత్ రెడ్డి మేడారం ఘటనపై సిట్ వేసి నాసి రకం పనులకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

