రిస్క్ వద్దు.. కారుకు గుద్దు..
‘రిస్క్ వద్దు.. కారుకు ఓటు గుద్దు’ అంటూ మంత్రి హరీశ్‌రావు పిలుపునివ్వడం ప్రజలను ఆకట్టుకున్నది. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు ఉండదని ఆయన తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ నర్సంపేట అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి నెక్కొండలో హరీశ్‌రావు శనివారం రోడ్ షో నిర్వహించగా భారీ స్పందన వచ్చింది.
- కాంగ్రెస్‌కు ఓటెస్తే కరెంటు ఉండదు..
- ఆ పార్టీ నాయకుల కొట్లాట కుర్చీ కోసమే..
- ఢిల్లీకి ఊడిగం చేయడమే వారి పని
- తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్..
- ప్రజలే మాకు బాస్‌లు
- పేదల అభివృద్ధి, సంక్షేమమే సీఎం కేసీఆర్ ఆశయం
- మరోసారి పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఆశీర్వదించాలి
- నెక్కొండ రోడ్డు షోలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన ప్రజలు
‘రిస్క్ వద్దు.. కారుకు ఓటు గుద్దు’ అంటూ మంత్రి హరీశ్‌రావు పిలుపునివ్వడం ప్రజలను ఆకట్టుకున్నది. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు ఉండదని ఆయన తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ నర్సంపేట అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి నెక్కొండలో హరీశ్‌రావు శనివారం రోడ్ షో నిర్వహించగా భారీ స్పందన వచ్చింది. అశేషంగా తరలివచ్చిన ప్రజలు దారిపొడవునా వారిపై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. హస్తం పార్టీ కొట్లాట అంతా కుర్చీ కోసమే అని, ప్రజల బాగోగుల గురించి ఏనాడు ఆలోచించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఢిల్లీకి ఊడిగం చేయడమే వారి పని అని ఎద్దేవా చేశారు. తెలంగాణ సాధన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, ప్రజలే మాకు బాస్‌లు అని పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మరోసారి కారు గుర్తుకే ఓటు వేసి పెద్ది సుదర్శన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాడు అర్ధరాత్రి వచ్చే దొంగ కరెంటు కోసం రైతులు బావుల కాడికి కావలి పోయిన రోజులను మరిచిపోవద్దన్నారు. మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్‌ను తరిమికొట్టి, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్కు ప్రజలు అండగా నిలువాలని మంత్రి కోరారు.
– నర్సంపేట/నెక్కొండ, నవంబర్ 25
నర్సంపేట, నవంబర్ 25 : కాంగ్రెస్ పార్టీ నాయకులు రాని సీఎం పదవి కోసం కొట్లాడు కుంటున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శనివారం నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో రైతుబంధు ఇవ్వ డం కుదరదని అధికారులు చెప్పారని, కానీ సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బందుపెట్టయినా రైతుబంధు ఇవ్వా లని చెప్పారని తెలిపారు. మన ఇంటోడు సీఎం కేసీఆర్ కావాలా? మరకపడ్డ రేవంత్‌రెడ్డి కావాలా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఈ గడ్డమీద పుట్టిన బీఆర్ఎస్ కావాలా? ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాలా అని ప్రశ్నించారు. తె లంగాణ వచ్చిన తర్వాత రెండు పంటలు పండు తున్నాయా?లేదా అని అడిగారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంటు, 10హెచ్‌పీ మోటర్లు వినియోగించాలని అంటున్నాడని, ఆయనకు దమాక్ ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రతి రైతుకు రూ.15 వేలు ఇస్తామని అంటున్నదని, దీనిలో తిరకాసు ఉందన్నా రు. ఎన్నికల కమిషన్ రైతుబంధు నిధుల విడుదలకు అనుమతులు ఇచ్చిందని, త్వరలోనే అకౌం ట్లలో డబ్బులు వేస్తామన్నారు. రైతుబంధు ఇచ్చినట్లు రుణమాఫీకి కూడాఅనుమతి ఇస్తే పూర్తి చే స్తామన్నారు. రైతుబంధు కింద రూ.80 వేల కోట్లు ఇచ్చామని, రుణమాఫీ డబ్బులు రూ.4 వేల కోట్లు ఇవ్వడం కష్టం కాదన్నారు. ఇళ్ల జాగలు లేనివారికి జాగ ఇచ్చి ఇల్లు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కరోనా వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని అన్నారు.

బోరుబావుల కాడ మీటర్లు పెట్ట ని కారణంగా రూ.28 వేల కోట్లు ఆపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టంగా చెప్పారని, సీఎం కేసీఆర్ రైతుల కోసం అంత డబ్బు వదులుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు మార్పు కావాలని అంటున్నారని, రూ.2వేల పింఛన్‌ను రూ.200 చేస్తారా? 24 గంటల కరెంటును మూడు గంటలు చేస్తారా? ఈ మార్పు కావాలా? అని ప్రజలకు ప్రశ్నించారు. నాడు ముంబైకి వలస పోయేదని, ఇప్పుడు ఇతర రాష్ర్టా ల ప్రజలే ఇక్కడికి వచ్చి నాట్లు వేస్తున్నారని, ఇది అసలు సిసలైన కేసీఆర్ తెచ్చిన మార్పు అని అన్నారు. గిరిజనులు అడిగినవన్నీ చేశామని, బీఆర్ఎస్ను గెలిపిస్తే గిరిజనబంధు ఇచ్చి కాపాడుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేకాట క్లబ్‌ను బంద్ చేశామని, కాంగ్రెస్ మళ్లీ వస్తే గల్లీకో పేకాట క్లబ్ తెచ్చి మహిళల పుస్తెలతాడు తెంపుతుందని విమర్శించారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, నమ్మితే గోసపడుతామన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నాయకులు మారం రాము, రాయిడి రవీందర్‌రెడ్డి, బుర్రి తిరుపతి, బాల్నె వెంకన్న, కేతిడి వీరారెడ్డి, కొమ్ము రమేశ్ యాదవ్, సంగని సూరయ్య, కంది కృష్ణారెడ్డి, పత్తి నాయక్, లావుడ్యా సరోజ, జాటోత్ రమేశ్, జక్క అశోక్, ముద్దసాని సత్యనారాయణరెడ్డి, తూటి శ్రీ నివాస్, జున్నుతుల రాంరెడ్డి, బోడ బద్దునాయక్, పొన్నం మొగిలి, జీ సోమయ్య పాల్గొన్నారు.
నెక్కొండను మున్సిపాలిటీ చేస్తాం..
నెక్కొండ : పెద్ది సుదర్శన్‌రెడ్డిని మరోసారి నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెక్కొండను నెలరోజుల్లో మున్సిపాలిటీగా చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అహర్నిషలు జనం కోసం పనిచేసే పెద్దిని మరోసారి గెలిపించుకొని రెట్టింపు అభివృద్ధి చేసుకోవాలన్నారు. పెద్ది కోరిక మేరకే నర్సంపేటకు మెడికల్ కాలేజీ మంజూరు చేశామన్నారు. ఇప్పుడు నెక్కొండలో సివిల్ దవాఖాన ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పట్టుబడుతున్నారని, అది కూడా చేద్దామన్నారు. రెండు నెలల్లో నర్సంపేటలో పనులు పూర్తవుతాయని ఆ తర్వాత నెక్కొండలో సివిల్ ఆస్పత్రి ఏర్పాటుపై దృష్టి సారిసామ న్నారు. గిరిజనుల చిరకాల స్వప్నమైన తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి అధికారంలో గిరిజనులకు వాటా కల్పించింది తామేనన్నారు.
అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దా
- 1.35 లక్షల ఎకరాలకు సాగు నీరందించా
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నెక్కొండ : నర్సంపేటను అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దానని, మరోసారి తనను గెలిపించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. శనివారం నెక్కొండలో జరిగిన రోడ్‌షోలో పెద్ది మాట్లాడుతూ.. ఇప్పుడు ఒకప్పటిలా కమీషన్లు, కబ్జాలు, దందాలు, దౌర్జన్యాలు లేవని, ఉన్నదల్లా నిజాయితీతో కూడిన అభివృద్ధి మాత్రమేనన్నారు. నల్లబెల్లి, నెక్కొండ మండలాలు తనకు రెండు కళ్లలాంటివని, ఇక్కడి ప్రజల బాగోగులు కనిపెట్టుకుంటూ పని చేశానన్నారు. కరోనా సమయంలో నర్సంపేటలో సొంత ఖర్చులతో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడి బిడ్డలను కాపాడుకోగలిగామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 1.35లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు, కాల్వలు నిర్మించుకున్నామన్నారు. వట్టెవాగుపై రోడ్ కమ్ చెక్‌డ్యామ్‌లు, మండలంలో రోడ్ల నిర్మాణానికి రూ.130కోట్లు మంజూరు చేయించానన్నారు. నర్సంపేటకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరూ ఊహించలేదని, కానీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో మెడికల్ కాలేజీని తీసుకువచ్చానన్నారు. డయాగ్నస్టిక్ సెంటర్‌నూ ఏర్పాటు చేసుకున్నామన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

