జయశంకర్ భూపాలపల్లి : మంథనిలో బీఆర్ఎస్ నాయకుడు పుట్ట మధు ( Putta Madhu) నివాసాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించడాన్ని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) ధర్నా నిర్వహించారు. జిల్లాలోని మంథని నియోజక వర్గం కాటారంలో ధర్నా నిర్వహించి మంత్రి శ్రీధర్ బాబు , కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మను ( Effigies burnt ) దహనం చేశారు.
బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అధికారం ఉందికదా అని కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యకాండ కొనసాగుతుందని విమర్శించారు. ధర్నాలో జడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని, సబ్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పలిమేల పోలీస్ స్టేషన్కు తరలించారు.