ఏటూరునాగారం, ఆగస్టు 30 : రుణమాఫీ పెండింగ్ లేకుండా త్వరగా క్లియర్ చేయాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క బ్యాంకర్లను ఆదేశించారు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, వైద్యాధికారులతో కలెక్టర్ టీఎస్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రాతో కలిసి ఆమె సమీక్షించారు. రుణమాఫీ కింద ప్రభుత్వం ములుగు జిల్లాలోని బ్యాం కులకు రూ.190 కోట్లను విడుదల చేయగా ఇప్పటివరకు రూ.101 కోట్లు మాత్రమే క్లియ ర్ చేసినట్లు తెలుస్తున్నదని, మిగతావి ఎందు కు పెండింగ్ పెడుతున్నారని బ్యాంకు అధికారులను ప్రశ్నించారు.
రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పించుకుని ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతులను అన్ని వి ధాలా ఆదుకునేందుకు సహాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులు తరచూ బ్యాంకుల చుట్టూ తిరగడం వల్ల వారి సమయం వృథా అవుతుందన్నారు. రుణమాఫీ కోసం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
బ్యాంకు ల్లో ప్రత్యేక సమయం కేటాయించి రుణమాఫీ అమలుచేసేలా బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని వచ్చే వినతులు స్వీకరించి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. జిల్లాలో యూరియా కొరత లే కుండా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. వ్యవసాయ ప్రణాళికను ముం దస్తుగా సిద్ధంచేసుకోవాలన్నారు. ములుగు పర్యటనపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని, అధికారులంతా బాగా పనిచేశారని, అదే స్ఫూర్తితో నిత్యం జిల్లాలోని ప్రజల కోసం పనిచేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కలెక్టర్ దివాకర మా ట్లాడుతూ రుణమాఫీ అమలులో బ్యాంకర్లు సకాలంలో స్పందించడం లేదన్నారు. ఒక్క బ్యాంకు కూడా సరైన నివేదిక ఇవ్వకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా ఒకటిరెండు రోజుల్లో క్లియర్ చేస్తామంటూ బ్యాంక ర్లు సమాధానమిచ్చారు. సమావేశంలో డీఎంహెచ్‌వో అప్పయ్య, ములుగు ఏరియా వైద్యశాల, ఏటూరునాగారం సామాజిక వైద్యశాలల సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సురేశ్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.