ములుగు : మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. బుధవారం మహేష్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్‌ను అందజేశారు. మహేష్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాగా, గత ఆరు నెలలుగా జీతాలు అందక ఆత్మహత్య చేసుకున్నాడు.
పారిశుధ్య కార్మికుడి ఆత్మహత్యపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఏరియా హాస్పిటల్ నుంచి బస్టాండ్ వరకు భిక్షాటన చేసిన విషయం తెలిసిందే.