ములుగు, జనవరి 7(నమస్తే తెలంగాణ) : వచ్చే నెల 12నుంచి 15వరకు జరిగే మినీ మేడారం జాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీత క్క ఆదేశించారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం లో కలెక్టర్ టీఎస్ దివాకర అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జాతర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, ప్రతి పనినీ నాణ్యతతో చేసి శాశ్వతంగా నిలిచిపోయేలా చూడాలని చెప్పారు. మహాజాతర సందర్భం గా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుం డా చూడాలన్నారు.
15 రోజుల నుంచి భక్తు ల రాక పెరిగిందని, ఫిబ్రవరి మొదటివారం నుంచే భక్తుల తాకిడి అధికం కానున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉం డాలని సూచించారు. జాతరకు వచ్చే అన్ని లింకు రోడ్లను జనవరి 31లోగా పూర్తి చేయాలన్నారు. తల్లులను దర్శించుకునే సమయం లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన వసతులను కల్పించాలన్నారు. అధికారులు సమర్పించిన అభివృద్ధి పనుల అంచనాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. జాతర విజయవంతానికి జిల్లా యంత్రాంగంతో పాటు ఐటీడీఏ అధికారులు కృషిచేయాలని కోరారు. సమావేశంలో ఎస్పీ పి.శబరీష్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, డీఎఫ్‌వో రాహుల్ కిషన్‌జాదవ్, డీఎస్పీ రవీందర్, మేడారం ఆలయ ఈవో రాజేంద్రం, డీపీవో ఒంటేరు దేవరాజు, డీపీఆర్వో ఎండీ రఫీక్ పాల్గొన్నారు.