SEETHAKKA | ములుగు : ములుగు మండలంలోని జగ్గన్నపేట లో ఓపెన్ టెక్స్ట్ గిరిజన గ్రామ దత్తత కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్-ఇంజనీరింగ్, సైట్ లీడర్, ఓపెన్ టెక్స్ట్ ఇండియా సంగీత, యనమంద్ర, వ్యవస్థాపకులు, గ్లోబల్ సీఈవ్, నిర్మాణ్ ఆర్గనైజేషన్, మయూర్ పట్నాల, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు పాల్గొన్నారు. అలాగే వెంకటాపూర్ మండలం లోని ఇంచెంచెరువు పల్లె లో సర్వీస్ నౌ సంస్థ గిరిజన గ్రామ దత్తత కార్యక్రమాన్ని మంత్రి ధనసరి అనసూయ సీతక్క, నిర్మాణ్ ఆర్గనైజేషన్, మయూర్ పట్నాల, సర్వీస్ నౌ సంస్థ ప్రతినిధులు విద్యానంద, స్నేహ లత, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జి, సంపత్ రావు లతో కలసి ప్రారంభించారు.