ములుగు : జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తంగేడు మైదానం వద్ద ర్యాలీని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ర్యాలీ డీఎల్ఆర్ గార్డెన్ వరకు కొనసాగింది.
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, ఎస్ పి డాక్టర్ పి. షబరిష్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జీ, అదనపు ఎస్పీ సదానందం, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.