ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించి, ఎనిమిదిన్నరేళ్లలోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అంటే ప్రతి ఇంటా పండుగేనని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా వరంగల్‌లోని అజంజాహీ మిల్స్ గ్రౌండ్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకలను మంత్రి ఎర్రబెల్లి బుధవారం పండుగ వాతావరణంలో ప్రారంభించారు. సెక్రటేరియట్ భారీ సెట్టింగ్‌తో పాటు ఇక్కడ ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల ఎగ్జిబిట్లు, ఉద్యమ ఘట్టాల చిత్రాలను ప్రజాప్రతినిధులు, ప్రజలు చూసి ఎమ్మెల్యేను అభినందనలతో ముంచెత్తారు. ఇక్కడ నన్నపునేని మాట్లాడుతూ త్వరలోనే ప్రధాని పీఠంపై కేసీఆర్ కూర్చుంటారని ధీమా వ్యక్తం చేశారు.
వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 15 : ఇంటింటికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు అంటే ప్రతి ఇంట్లో పండుగేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో అజంజాహీ మిల్స్ గ్రౌండ్లో కొత్త సచివాలయ నమూనాతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ వేడుకలను జ్యోతిప్రజ్వలన చేసి మంత్రి బుధవారం ప్రారంభించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనను దేశమంతా కోరుకుంటున్నదని, ఎన్నికల తర్వాత దేశాన్ని పాలించేది ఆయనేనని ధీమా వ్యక్తం చేశారు. మహాత్ముడు చూపిన శాంతి మార్గంలో ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ కేంద్రం వెన్నులో వణుకు పుట్టించారని గుర్తు చేశారు. తెలంగాణను బంగారుమయం చేసేందుకు ప్రాజెక్టుల రీ డిజైన్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి గోదావరి జలాలతో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు. వరంగల్‌కు ఉన్న ఏకైక అజంజాహీ మిల్స్ మూతపడేందుకు కాంగ్రెస్ కారణమైతే, కమలాపూర్ బిల్ట్ ఫ్యాక్టరీ మూతపడేందుకు బీజేపీ కారణమని విమర్శించారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దాదాపు 1200 ఎకరాలు సేకరించి టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. త్వరలోనే సుమారు లక్ష మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష విధానంలో ఉపాధి లభిస్తుందన్నారు. వరంగల్ జిల్లా ప్రజలకు పాలన దగ్గర చేసేందుకు సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదర్శవంతమైన పాలనతో తెలంగాణను ముందుకు నడుపుతున్న సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరు మద్దతుగా ఉండాలని కోరారు. ఇక్కడ ఎమ్మెల్యే నరేందర్ ఏర్పాటు చేసిన ఉద్యమ, కేసీఆర్ చిత్రాలను ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సందర్శించాలని సూచించారు.
తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి దేశ ప్రజలు కేసీఆర్ ప్రధాని పీఠంపై కూర్చోవాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కేసీఆర్ పర్యవేక్షణలో నిర్మించిన కొత్త సచివాలయం రాష్ర్టానికి నిషాన్‌గా నిలుస్తుందని, ఎన్నికల కోడ్ కారణంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు కొత్త సచివాలయంలో నిర్వహించడం కుదరక పోవడంతో వరంగల్‌లో భారీ సచివాలయ సెట్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎక్కని మెట్టు లేదు, మొక్కని దేవుడు లేడని గుర్తుచేశారు. ఉద్యమకారుల త్యాగాలే తెలంగాణకు పునాదులుగా నిలిచాయన్నారు. మూడు రోజులు కేసీఆర్ జన్మదిన వేడుకలు, చివరి రోజున శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
తూర్పులో నన్నపునేని నరేందర్‌ను గెలిపించే బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. యువ నాయకుడిగా, కలివిడిగా ఉండే నరేందర్‌కు నియోజకవర్గంలో మంచి పేరుందని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనను ఓర్వలేని బీజేపీ నాయకుడు బండి సంజయ్, కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాద్ధాంతాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు తుపాకిరాముడి వేషాలు వేస్తున్నాయని, మూర్ఖపు చేష్టలు చేస్తున్నాయని విమర్శించారు.
వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, తెలంగాణ ఆరోగ్య కమిటీ చైర్పర్సన్ హరి రమాదేవి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు ఎగ్జిబిట్లు, ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఫొటోలను చూస్తూ నాటి ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ వేదికను అత్యద్భుతంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నరేందర్‌ను అభినందించారు. బుధవారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ విభాగాల్లో పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు – మన బడి, పట్టణ పగ్రతి, నిరంతర విద్యుత్ సరఫరా, రైతు బంధు, రైతు బీమా, కంటి వెలుగు, కేసీఆర్ కిట్, మధ్యాహ్న భోజనం, షీ టీమ్స్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆసరా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గ్రామజ్యోతి తదితర సంక్షేమ పథకాల ఎగ్జిబిట్లు, టీ హబ్, యాదాద్రి ఆలయం, కాళేశ్వరం ప్రాజెక్టు, టీఎస్ఐ పాస్ నమూనాలు వేడుకల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేసీఆర్ బాల్య, రాజకీయ, ఉద్యమ ప్రస్థానాలను, గులాబీ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి సాగిన ఉద్యమ ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ చూపరులను ఆలోచింపజేస్తున్నది.
కేసీఆర్ ప్రధాని కావాలన్నది