తొర్రూరు : మోసకారి కాంగ్రెస్ మాటలు నమ్మి గోసపడొద్దు.. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని అబద్దాల ప్రచారంతో ముం దుకొస్తున్న కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. తొర్రూరు సభలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఉంటూ చుట్టపు చూ పుగా ఎన్నికలప్పుడు డబ్చు సంచులతో వచ్చే ఎ న్నారైలకు ఇక్కడి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయ ని ప్రశ్నించారు. ఏసీలో ఉండే వాళ్లు కావాలా? మీతో ఎండలో ఉండి కష్టాసుఖాలు పంచుకునే దయన్న కావాలో తేల్చుకోవాలని సూచించారు. కరోనా కష్టకాలంలో ఈ ఎన్నారై ఇక్కడి ప్రజలను ఏం ఆదుకున్నదో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. ప్రజల కష్టాలు పట్టించుకోని కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడు వచ్చి ఏదో చేస్తామని చెప్ప డం విడ్డూరంగా ఉందన్నారు. ఎర్రబెల్లి చారిటబు ల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది మహిళలకు ఉచి త కుట్టు శిక్షణ, ఉపాధి అవకాశాలు, 23వేల మం ది యువతకు డ్రైవింగ్ లైసెన్సులు, నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ తరగతులు, స్టడీ మెటీరియల్ పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశామని వివరించారు. అలాగే మిషన్ కాకతీయ, ఎస్సారెస్పీ, దేవాదుల పనులు పూర్తి చేసి చెరువులు నింపామని, ఇప్పటికి 150 గ్రామాలకు నీళ్లు అందించామని మళ్లీ గెలువగానే మిగతా 20 గ్రామాలకు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా, మున్సిపల్ కేంద్రంగా ఉన్నతీకరించి రూ.200కో ట్లతో అభివృద్ధి చేశామని, 100 పడకల దవాఖానకు శంకుస్థాపన చేశామని తెలిపారు. పాలకుర్తిలో పురాతన ఆలయాలను పునరుద్ధరించామని వల్మిడి, బమ్మెర, పాలకుర్తి ఆలయాల చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా పర్యటకంగా వన్నె తెచ్చేలా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. దేవరుప్పుల మండలంలోని వాగులపై చెక్‌డ్యాంలు, బ్రిడ్జిల నిర్మాణం, కొడకండ్లలో రూ.100 కోట్లతో మినీ టెక్స్టైల్ పార్క్‌ను నిర్మించబోతున్నామని, పెద్దవంగరను మండలంగా ఏర్పాటు చేయించి అభివృద్ధి చేస్తున్నామని, రాయపర్తి మండలకేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నామని, సన్నూరు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.15కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు. మీకు కష్టం వస్తే మీ దయన్నగా తోడుంటున్నానని చెప్పారు. పాలకుర్తిలో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను మంజూరు చేశారని, అన్ని గ్రామాలు, తండాల అభివృద్ధికి కృషిచేశానని, రూ.200కోట్ల చెక్‌డ్యాంల నిర్మాణం చేయడంతో ఆకేరు, పాలేరు వాగుల పరివాహక ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగి బోర్లు, బావుల్లో జలకళ ఉట్టిపడిందన్నారు. 4వేల డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించామని వివరించారు.
ప్రజల ఆశీర్వాదంతో వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారని, పాలకుర్తి ప్రజలు మరోసారి నిండుమనసుతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, పాలకుర్తి ప్రజల ఆదరణతో లక్ష ఓట్ల మెజార్టీతో గెలువబోతున్నానని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తాను గెలువగానే నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కళాశాల, పాలకుర్తిని రెవెన్యూ డివిజన్, రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని, అదనంగా 5వేల ఇండ్లు, సంచార జాతులు, బుడగ జంగాల కులస్తులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, సన్నూరు వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల్లో దశాబ్దాల కాలంగా కాస్తులో ఉండి సాగు చేసుకుంటున్న వారికి పట్టాలిచ్చి రైతుబంధు వర్తింపజేయాలని కేసీఆర్‌ను కోరారు. సంచార జాతులు, బుడగ జంగాలకు తొర్రూరులో రూ.5కోట్లతో భవనాలు నిర్మించబోతున్నామని, ఎన్నికల కోడ్ కారణంగా గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయిందని, ఎన్నికలు పూర్తవగానే కలెక్టర్ ద్వారా కార్డులు ఇప్పిస్తానని తెలిపారు. దయాకర్‌రావును భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రతి గ్రామానికి వంద ఇండ్లను మంజూరు చేస్తానని, ఆయన కోరినవన్నీ నెరవేరుస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.