భావిభారత దార్శనికుడు కేసీఆర్
‘భావి భారత దార్శనికుడు మన కేసీఆర్.. దేశ ప్రజ లు ఆయనను ప్రధానిగా చూడాలనుకుంటున్నారు.., తెలంగాణ మోడల్ అన్ని రాష్ర్టాల్లో అమలు
- దేశ ప్రజలు ప్రధానిగా చూడాలనుకుంటున్నారు..
- సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- కేక్ కట్ చేసి సంబురాలు
జనగామ, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ)/ దేవరుప్పుల: ‘భావి భారత దార్శనికుడు మన కేసీఆర్.. దేశ ప్రజ లు ఆయనను ప్రధానిగా చూడాలనుకుంటున్నారు.., తెలంగాణ మోడల్ అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు భగవంతుడు నిండు నూరేళ్ల ఆయుష్షును ఇచ్చి మంచి ఆరోగ్యం ప్రస్తాదించాలని వేడుకుంటున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జమున, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, జడ్పీటీసీ దీపిక, ఎంపీపీ కళింగరాజు, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు పల్లవి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాంప్రసాద్, బీఆర్ ఎస్ కార్యాలయ కోర్డినేటర్ డాక్టర్ సుల్తాన్రాజా తో కలిసి మంత్రి ఎర్రబెల్లి కేక్‌కట్ చేశారు. దేవరుప్పుల మండల కేంద్రంలో స్థానిక నేతలతో కలిసి కేక్‌కట్ చేశారు.
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు కామారెడ్డిగూడెం, అంబేద్కర్ విగ్రహం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిరంతరం ప్రగతి కాముక కర్షకుడ ని, సంకల్పించిన కలని సాకారం చేయడం కోసం ఎన్నో కష్టాలను ఎదిరించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. 14 ఏళ్ల పాటు ఉద్యమించి, రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో తెలంగాణను అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. కేసీఆర్ సంకల్పం, చిత్తశుద్ధితోనే ఇది సాధ్యమైందని, అదే కేసీఆర్ నేడు బీఆర్ఎస్ ద్వారా దేశం మీద దృష్టి సారించారని అన్నారు. తెలంగాణ తరహా అభివృద్ధి, మా ర్పును దేశం ఆహ్వానిస్తున్నదన్నారు. పేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సమాజమే కాకుండా దేశం యావత్తు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నదన్నారు. ప్రజల ఎనలేని అభిమానం, ఆశీస్సులతో వారు మరెన్నో ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

