Mid day Meals | పెండింగ్ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు (Mid day Meals) చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అ
ఖిలావరంగల్: పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు (Mid day Meals) చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందచేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు బైరబోయిన సరోజన మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామన్నారు. ఐదు నెలలుగా బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెడుతూ తమ పిల్లలను పస్తులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
డీఈవో ఆఫీసుకు వెళ్లితే బిల్లులు చేస్తామంటూ దాట వేస్తున్నారే తప్పా పనులు చేయడం లేదన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన కూడా బిల్లులు సకాలంలో చెల్లించడంలో విద్యా శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు, 9, 10 వ తరగతులకు కలిపి ఒకే సారి ఎగ్ బిల్లులు, వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.5వేలకు పెంచాలన్నారు. అలాగే కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. మధ్యాహ్న భోజన వంట కార్మికుల న్యాయమైన కోరికలను నెరవేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వంట కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

