హనుమకొండ, నవంబర్ 11: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రిన్సిపాల్, శాఖాధిపతి, ఆఫీస్ సూపరింటెండెంట్స్, హాస్టల్ మేనేజర్స్పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మేకల అక్షయ్‌కుమార్ డిమాండ్ చేశారు. అలాగే అదనపు బాధ్యతలతో ఆయా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నారన్నారు.
మరోవైపు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయా సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవడం కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఖాళీలను భర్తీ చేయాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ నాయకులు దొడ్డిపల్లి కుమార్, పూదరి శ్రీకాంత్, బానోత్ వెంకన్న పాల్గొన్నారు.