Kakatiya University | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 19 : హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళలో 16 విభాగాల నుంచి వివిధ కంపెనీలలో డిగ్రీ, బీటెక్, ఫార్మసీ విద్యార్హతలు కలిగిన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
100 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాలేజీలో పివి నరసింహారావు ఈ కళాశాల విద్యార్థి అని ఆమె అన్నారు. పోటీ ప్రపంచంలో ఉద్యోగావకాశాలు మన వద్దకే వస్తున్నాయని, కాలేజీలో ప్రతి నెల జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకొని కాలేజీలో చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేదిశగా తగు చర్యలు చేపడతామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.