మహబూబాబాద్, మే 27 : ఎస్పీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ సబ్‌డివిజనల్ పోలీ స్ ఆధ్వర్యంలో జూన్ 4న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు టౌన్ సీఐ సతీశ్ తెలిపారు. శుక్రవారం టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో సుమారు 50 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, సుమారు 600 ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
జూన్ 4న జిల్లా కేంద్రం శివారు మహర్షి విద్యాలయంలో ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. హాజరయ్యే అభ్యర్థులందరికీ మధ్యాహ్న భోజన వసతి కల్పించనున్నట్లు చెప్పారు. 10 తరగతి నుంచి పై చదువులు చదివిన విద్యార్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో రావాలని, అర్హతలను బట్టి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వివరాల కోసం డోర్నకల్, గార్ల, బయ్యారం, గూడూరు, కొత్తగూడ, గంగారం, కేసముద్రం, మహబూబాబాద్ రూరల్, మహబూబాబాద్ పోలీస్స్టేషన్లలో సంప్రదించాలని సూచించారు. వివరాలకు టౌన్ సీఐ సెల్ నంబరు 9440795239లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు శీలం రవియాదవ్, విజయ్, మునీరుల్లా, దీపికారెడ్డి పాల్గొన్నారు.