రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. ప్రకృతి ప్రకోపానికి మేడారం అటవీ ప్రాంతం ఊహకందని విధ్వంసానికి గురైంది. విదేశాల్లో మాత్రమే వెలుగుచూసే టోర్నడో తరహా సుడిగాలులతో ఎన్నడూలేని విధంగా అరుదైన, అసాధారణ రీతిలో వనమంతటినీ ఒక్క ఉదుటున నేలకూల్చేసి అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
ప్రకృతి విలయతాండవానికి 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెట్లన్నీ ఎవరో కొట్టేసినట్టు ఒకవైపే పడిపోగా, 16 విద్యుత్స్తంభాలూ నేలకూలాయి. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని సంఘటన ఈ నెల 1న తెల్లవారుజామున ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగగా విధ్వంసానికి కారణాలేమిటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే వాతావరణ మార్పులే దీనికి కారణమై ఉంటుందని శాస్త్రీయ దృక్పథంతో నష్టనివారణ చర్యలు తీసుకోవాలని పరిశోధకులు, పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
– ములుగు, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ)/ తాడ్వాయి
పీడనం ఎక్కువైనప్పుడు గాలి ప్రయాణించే మార్గంలో అడ్డు వచ్చిన వాటిని కూల్చివేస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. 13 ఏళ్ల క్రితం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఇలాంటి విపత్తు కారణంగా 1200 ఎత్తైన టేకు చెట్లు పడిపోయాయని.. కానీ రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి విధ్వంసం ఇదే మొదటిదని అం టున్నారు. అయితే అటవీ ప్రాంతం అయినందున ప్రాణనష్టం తప్పిందని.. ఒక విధంగా అ డవి ప్రజల ప్రాణాలను కాపాడిందని అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో అప్పుడప్పుడు వ చ్చే టోర్నడో, హరికేన్ వంటి ప్రకృతి విలయాలు తెలంగాణ అటవీ ప్రాంతంలో చోటుచేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు, పర్యారణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న నష్టాన్ని మ నం నిత్యం అతివృష్టి, అనావృష్టిల రూపంలో చూస్తు న్నాం. అయినా మన ప్రవర్తనలో మార్పు రావడం లే దు. గత కొద్దిరోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలు, జరుగుతున్న నష్టాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ శాశ్వత ప్రాతిపదికన ఆలోచించడం లేదు. ఇటీవల ఏటూరునాగారం అభయారణ్యంలో 200హెక్టార్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాం తం పూర్తిగా దెబ్బతినడం ఆందోళనకరం. ఇలాంటి ఘ టన మన దగ్గర ఎన్నడూ జరగలేదు.
కొన్నిచెట్లు పూర్తి గా వేర్లతో కిందపడిపోగా, మరికొన్నింటి కొమ్మలు పూర్తిగా, పాక్షికంగా విరిగి మోడులు మాత్రమే మిగిలాయంటే ఎంత నష్టం జరిగిందో మనం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇకడ మనం ఒక చెట్ల గురిం చి మాత్రమే మాట్లాడుకోవడం తప్పు. ఎందుకంటే ఈ వనాలను ఆధారంగా చేసుకుని జీవిస్తున్న పక్షులు, సరీసృపాలు, క్రిములు, కీటకాలు, వాటి తరాలు, ఇతర త్రా జీవులు, వాటి మధ్య చెదిరిపోయిన సంబంధాల పై కూడా ఆలోచించాలి. ఈ జీవరాశుల సమాహారమే అటవీ వ్యవస్థ. వీటన్నింటికి నివాసయోగ్యమైన, అనుకూల పరిస్థితులు సృష్టించాలంటే అసాధ్యం. కానీ, ఎంతో కొంత అనుకూల పరిస్థితులు సృష్టించాలంటే చాలా శాస్త్రీయ దృక్పథం కావాలి. దీనికి వృక్ష, జంతుశాస్త్ర నిపుణులతో వెంటనే ప్రాథమిక క్షేత్ర అధ్యయనం చేయాలి.
అడవిని నష్టపోయిన ప్రాంతంలో ఎలాంటి మొకలు, ఎప్పుడు, ఎలా పె ట్టాలనే విషయం మీద స్పష్టమైన అవగాహన అవసరం. విధిగా నల్లమద్ది, తెల్లమద్ది, ఉసిరి, నారేప, మా రేడు, ఇప్ప, సండ్ర, తెల్లతుమ్మ, బండారు, బుడధర్మి, మొర్రి, పాల, తీగమోదుగ, రేల, బూరుగు, బిల్లుడు, కొడిశ, జిట్రేగు, పచ్చరి, బాడిద, గరుగ, గుమ్మడి టే కు, బొంగు (వెదురు), పాలవరేని, దుంపెన, చిలుక దుద్దు, ఎగిస, జీడీ, చిల్ల, విషముష్టి, తునికి, టేకు, తా నికాయ, కరకాయ, బొజ్జ లాంటి దేశీయ, స్థానిక మొకలను మాత్రమే నాటాలి. వీటిని నర్సరీల్లో పెంచడానికి కావాల్సిన విత్తనాలను త్వరితగతిన సేకరించి, వెంటనే పెంచే ప్రక్రియ చేపట్టాలి. జరగాల్సిన నష్టం జరిగింది. శాస్త్రీయ దృక్పథంతో నివారణ చర్యలు చేపట్టాలి.
– సుతారి సతీశ్, వృక్షశాస్త్ర అధ్యాపకుడు, కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ